nee vaaku vinipinchumayya నీ వాక్కు వినిపించుమయ్యా నేత్రాలు తెరిపించుమయ్యా
నీ వాక్కు వినిపించుమయ్యా - నేత్రాలు తెరిపించుమయ్యా - 2
నీ ముఖమును నాకు చూపుమూ - నీ మహిమకు నన్ను మార్చుము - 2
1. నీ తట్టు చూడగా వెలుగు కలుగును - ముఖములందు సిగ్గు కాన రాకపోవును - 2
నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును - నీ కటాక్షమే నన్ను విమోచించును - 2
నీ కటాక్షమే నన్ను విమోచించును..
2. నీ వైపు తిరుగగా ముసుగు తొలగును - ముఖములందు గొప్ప మహిమ ప్రతిఫలించును - 2
నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును - నీ హస్తమే నన్ను రక్షించును - 2
నీ హస్తమే నన్ను రక్షించును..