ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా
అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2
నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా - 2
1. మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు - 2
అంగీకరించుము నా సమర్పణ
2. కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు - 2
అంగీకరించుము నా సమర్పణ