• waytochurch.com logo
Song # 2451

naa sneham నా స్నేహం యేసుతోనే నా గమ్యం క్రీస్తులోనే



నా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే = 2

నా తల్లిదండ్రులు నన్ను విడిచినా - యేసు నన్ను విడువడు

నా హితులందరూ నన్ను మరిచినా - యేసు నన్ను మరువడు




1. జగతికి రూపము లేనపుడు - నను సృజియించేను

పిండముగా నేనున్నపుడు - నను ఏర్పరచేను

చేయిపట్టి నడిపే దేవుడుండగా - భయమిక నన్ను చేరదూ

తన కంటిపాపలా నన్ను కాయునూ - శ్రమయూ నన్నేమి చేయదు




2. నా ప్రభు అరచేతిలో నేను - చెక్కబడి యుంటిని

తన కరముల నీడలో నిలిచి - స్తోత్రము చేయుదును

నేను చేయు స్తుతుల మూలముగా - గొప్ప దుర్గమును స్థాపించెను

కాయము మొదలు జీవితాంతము - చంకనెత్తుకొను ప్రియ ప్రభువే

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com