naa sameepamai నా సమీపమై యున్న నా దేవుడవేసయ్యా
నా సమీపమై యున్న - నా దేవుడవేసయ్యా
నా చేరువలో ఉన్న - నా ఆత్మీయ బంధువుడా = 2
నా ముందూ వెనకను నీవే - నా ఇరుప్రక్కలను నీవే - 2
అంతట వ్యాపించి యున్న - మహిమా ఘనతయు నీకే - 2
1. తెలిసి తెలిసి ఎన్నో మారులు - దోషము చేసిన పాపిని - 2
కలువరి రుధిరముతో - కడిగిన నాధుడవు
కరుణా కాటాక్షము - నిలిపిన ప్రభుడవు = 2
2.నిరాశ నిస్పృహ వేళలో - గమ్యము చూపిన ఘనుడవు - 2
వెనుకున్నవి మరచి - ముందున్న మకుటముకై
సియోనులో చేరుటే - నా చిరకాల కోరిక = 2