sthuthi cheyute kaadhu స్తుతి చేయుటే కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన
స్తుతి చేయుటే కాదు ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన
గమనించు దేవుని మనసులో ఆవేదన - వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన
Work is worship - దేవునితో fellowship - 2
ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధనా ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన
1. పెదవులతో ఘనపరచి - కూర్చుని లేస్తే సరిపోదు
మోకరించి ప్రార్ధన చేస్తే - పాపి మారడు = 2
ఆత్మతో సత్యముతో - తండ్రిని ఆరాధించాలి
అర్పణ ఆరాధనలు - దేహంతో జరగాలి
మనకున్న అవయవాలు - ప్రభు పనిలో అరగాలి
ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధనా ఆరాధన - పాపిని రక్షించుటయే ఆరాధన
2. ఆత్మల రక్షణ మరిచి - ఆచరిస్తేనే సరిపోదు
ఆజ్ఞ మరిచి ఆరాధిస్తే - పాపి మారడు = 2
ఆత్మను రక్షించే - వాక్యం ప్రకటించాలి
బైబిల్ బాగా నేర్చుకుని - లోకానికి వెళ్లాలి
దేహాన్ని దేవుని సేవకు - సజీవంగా ఇవ్వాలి
ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధన
ఆరాధనా ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన