nijamugaa morapettinaa నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా
నిజముగా మొరపెట్టినా - దేవుడాలకించకుండునా ?
సహనముతో కనిపెట్టినా - సమాధానమీయకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?
1. పరలోక తండ్రినడిగినా - మంచి ఈవులీయకుండునా ?
కరములెత్తి ప్రార్ధించినా - దీవెనలే కురియకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?
2. సృష్టికర్తయైన వానికి - మన అక్కర తెలియకుండునా ?
సరియైన సమయానికి - దయచేయక ఊరుకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?