nibandhanaa janulam నిబంధనా జనులం నిరీక్షణా ధనులం
నిబంధనా జనులం - నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని - సిలువ రక్తపు సంబంధులం - మేము నిబంధనా జనులం
యేసురాజు వచ్చునూ - ఇంకా కొంత కాలమే - మోక్షమందు చేరెదము - 2
1. అబ్రహాము నీతికి - వారసులం
ఐగుప్తు దాటిన - అనేకులం = 2
మోషే బడిలో - బాలురము - 2
యేసయ్య ఒడిలో - కృతార్దులం.. ప్రియ పుత్రులం - [మేము....]
2. విశ్వాసమే మా - వేదాంతం
నిరీక్షణే మా - సిద్దాంతం = 2
వాక్యమే మా - ఆహారం - 2
ప్రార్ధనే మా - వ్యాయామం .. అనుదినమూ - [మేము....]
3. అశేష ప్రజలలో - ఆస్తికులం
అక్షయుడేసుని - ముద్రికలం = 2
పునరుత్థానుని - పత్రికలం - 2
పరిశుద్ధాత్ముని - గోత్రికులం.. యాత్రికులం - [మేము....]
4. నజరేయుని ప్రేమ - పొలిమేరలో
సహించుటే మా - ఘననియమం = 2
క్షమించుటే ఇల - మా న్యాయం - 2
భరించుటే మా - సౌభాగ్యం అదే.. పరమార్ధం - [మేము....]
5. క్రీస్తేసే మా - భక్తికి పునాది
పునరుత్థానుడే - ముక్తికి వారధి = 2
పరిశుద్ధాత్ముడే - మా రథసారధి - 2
ప్రభుయేసే మా - ప్రధానకాపరి.. బహునేర్పరి - [మేము....]
6. ఎవరీ యేసని అడిగేవో - ఎవరోలే యని వెళ్లేవో - 2
యేసే మార్గం - యేసే జీవం - 2
యేసే సత్యం - కాదు చోద్యం.. ఇదే మా సాక్ష్యం -[నిబంధనా....]