naa kaalagathu levvi naa chaetనా కాలగతు లెవ్వి నా చేతులను లే
Chords: ragam: శంకరాభరణము -shMkaraabharaNamu
నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే
వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు ||నా||
1.
తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను
మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను ||నా||
2.
పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి
చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా ||నా||
3.
సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు
సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా||
4.
సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను
ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి ||నా||