yehoavaa naa kaapari lae maemiయెహోవా నా కాపరి లే మేమి గలుగదు
యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ
బ్రోచి నన్ను మనుపు నాతఁడే||
1.
పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు
సదా యిచ్చు నాతఁడే||
2.
శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు
విభుఁడు అతఁడే||
3.
గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక
నా తోడు ఆయనే||
4.
దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో
నీతి దారిలో నడుపు||
5.
అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి
తృప్తిపరుచు విభుఁడు ఆయనే||
6.
ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ
బూయుచుండు సకల వేళలన్||
7.
బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా
క్షేమములు నా వెంటవచ్చును||
yehoavaa naa kaapari lae maemi galugadhu thana mahaa krupathoaAO
broachi nannu manupu naathAOdae||
1.
pachchikagala choatla nanu paruMdajaeyuchuAO gadu hechchagu saukhyamulu
sadhaa yichchu naathAOdae||
2.
shaaMthikara jalamulaku nanu saagajaeyuchu vishraaMthi praaNamuna kosMgu
vibhuAOdu athAOdae||
3.
gaaDaaMDhakaaramaina loayala guMda boayina nae keeduku bhayapada niAOka
naa thoadu aayanae||
4.
dhuddukaRRathoa shathruvulAO dharumAOgottuchuAO dhana dhodda dhMdamuthoa
neethi dhaariloa nadupu||
5.
aMdhariloa nannu neMchi yaDhika praemathoaAO gadu viMdhu losAOgi
thrupthiparuchu vibhuAOdu aayanae||
6.
mukhamu kaLagaa nuMdunatlu mMchithailamun naa sakhuAOdu naakuAO
booyuchuMdu sakala vaeLalan||
7.
bradhuku dhinamu lannita naaku bMtulavalenae nanu vedhaki krupaa
kShaemamulu naa veMtavachchunu||