nee paadamul ne cheragaa gaayambulan ne gaanchithin నీ పాదముల్ నే చేరగా గాయంబులున్ నే గాంచితిన్
నీ పాదముల్ నే చేరగా – గాయంబులున్ నే గాంచితిన్
నీ సిలువకై నే చేరగా – నీ ప్రేమను నే పొందితిన్
నా కొరకే ఈ మరణమా – నా పాపమే కారణమా (2) ||నీ పాదముల్||
నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా
నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా (2)
సమాధానార్థమైన శిక్ష మీద పడెను
పాపపరిహార్థ బలిగ వధియించబడెను (2) ||నా కొరకే||
వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా
మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే (2)
నీ వేదన చూసి హేళన చేసిన గానీ
వీరేమి చేతిరో ఎరుగరంటివే (2) ||నా కొరకే||
nee paadamul ne cheragaa – gaayambulan ne gaanchithin
nee siluvakai ne cheragaa – nee premanu ne pondithin
naa korake ee maranamaa – naa paapame kaaranamaa (2) ||nee paadamul||
naa athikramamula batti gaayaparachabadegaa
naa doshamulanu batti nalugagottabadegaa (2)
samaadhaanaardhamaina shiksha meeda padenu
paapa parihaardha baliga vadhiyinchabadenu (2) ||naa korake||
vadhaku thebadu gorrepilla nilachunatlugaa
mounamugaa nundi neevu theerpunondithive (2)
nee vedhana choosi helana chesina gaani
veeremi chethiro erugarantive (2) ||naa korake||