paraloakamuna numdu dhaeva neeపరలోకమున నుండు దేవ నీ పదముల కొ
పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు
నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి
గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక
మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి ||పరలోక||
1.
యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న
దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు
రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ
గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ||పరలోక||
2.
ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి
యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి
నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి
వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ ||బరలోక||
paraloakamuna nuMdu dhaeva nee padhamula konariMthu saeva dhurithMbulaku
naenu veRachi yunnaanani karuNiMchi nee suthuni Dhara kMpithivi
gaadhaa arayAOgaa nee praema yiMthanAO dharamu gaadhoa parama janaka
maraNa paryMthMbu ninu nae maruvAO jaalanu varakrupaa niDhi ||paraloaka||
1.
yaesukreesthuni dhayasaeya kunna moasa moMdhedha neMdhukanna
dhoasMbulaku naenu dhaasuMdanai prathi vaasarMbunu needhu bhaasu
raajnYlu vidichi vaesatalu gala narakamunAO bada dhroasina nadhi nyaayamau
gadha naa sunaaDhaa paermichaethanu nee suthuni nMpiMchinaavu ||paraloaka||
2.
ennaraani mahima nuMdi yaesu nannuAO baaliMpa naetheMchi
yenna shakyamu gaaka yunna paapamulanni Chinnaabhinnamu jaesi
nannu sammathiparapa nanna yagu naa rakShkuMdu thannu thaanarpiMchi
veMdiyu nunnathuMdai laechi yippudu sanniDhaanM bosAOge naakuAO ||baraloaka||