rmdi yuthsahimchi paadudhamu rరండి యుత్సహించి పాడుదము రక్షణ
రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే||
1.
రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు
నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||
2.
మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య
గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||
3.
సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్
ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
4.
ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||
5.
తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక
ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||
rMdi yuthsahiMchi paadudhamu rakShNa dhurgamu mana prabhuvae||
1.
rMdi kruthajnYtha sthoathramuthoa raaraaju sanniDhi kaegudhamu sathprabhu
naamamu keerthanalan sMthoaSh gaanamu chaeyudhamu ||rMdi||
2.
mana prabhuvae mahaadhaevuMdu ghana maahaathmyamugala raaju bhoomya
gaaDhapuloayalunu bhooDhara shikharamu laayanavae ||rMdi||
3.
samudhramu sruShtiMche naayanadhae sathyuni hasthamae bhuviAOjaesen
aayana dhaivamu paalithula maayana maepedi goRRelamu ||rMdi||
4.
aa prabhu sanniDhi moaAOkariMchi aayana muMdhara mrokkudhamu
aayana maatalu gaikonina nayyavi manakeMthoa maelagunu ||rMdi||
5.
thMdri kumaara shudhDhaathmakunu dhagu sthuthi mahimalu kalguAOgaaka
aadhini nippudu nellappudu nayinatlu yugamula naunu aamaen ||rMdi||