Viswaasa vanithalam yehova needana nivaasulam విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం
విశ్వాస వనితలం – యెహోవా నీడన నివాసులం
కన్నీటి ప్రార్ధనే మా బలం
ఆత్మ ఫలములే మా వరం
జయగీతం పాడెదం – విజయ కీర్తన పాడెదం
1. జ్ఞానము కలిగి జీవించెదం – యేసుని ప్రేమలో నిలిచెదం
విశ్వాసములో ఎదిగెదం – దేవుని సాక్షిగా బ్రతికెదం
2. శోధనలెన్నో కలిగిన – వాక్యపు వెలుగులో నడిచెదం
ఎర్ర సముద్రములెదురైన – దేవుని కృపతో దాటెదం
నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య
నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య
3. దేవుని చిత్తమునే చేసెదం – యేసుని నామమే ప్రకటించెదం
సువార్త భారముతో సాగెదం – సర్వలోకానికి చాటెదం
viswaasa vanithalam – yehova needana nivaasulam
kanneeti praardhane maa balam
aathma phalamule maa varam
jayageetham paadedham – vijaya keerthana paadedham
1. gnaanamu kaligi jeevinchedham – yesuni premalo nilichedham
viswaasamulo edhigedham – dhevuni saakshiga brathikedham
2. shodhanalenno kaligina – vaakyapu velugulo nadichedham
erra samudhramuledhuraina – dhevuni krupatho dhaatedham
neeve ila aadharam neeve ila aanandham neethone maa payanam yesayya
neeve maa viswaasam neeve maa uthsaaham neethone maa vijayam yesayya
3. dhevuni chitthamune chesedham – yesuni naamame prakatinchedham
suvaartha bhaaramutho saagedham – sarvalokaaniki chaatedham