sarwesvaruni dharshanamukai సర్వేశ్వరుని దర్శనముకై
సర్వేశ్వరుని దర్శనముకై
ఉదయమునే మ్రొక్కి వేచిఉంటిని
ప్రాణేశ్వర నా ప్రాణ ప్రియుడా
నీ మహిమతో నన్ను దర్శించుమా
సర్వేశ్వరా నా ఆత్మ రక్షకా
నీ దివ్య స్వరముతో మట్లాడుమా
పరమాత్ముడా లోక పరిపాలకా
ఘన మహిమ గలవాడా, గణనీయుడా
సర్వాంతర్యామివి నీవే యెహోవా
సర్వాధికారివి జనయత దైవమా
రాజాధి రాజా మా రక్షణ శృంగమా
రమణీయ సామ్రాజ్య పరిపాలకా
ప్రేమించే క్షమదాత నీవేనయ్యా
ప్రార్ధనలు ఆలించే మా యేసుయ్య
ఆల్ఫా ఒమేగా ఆది అనంతుడా
ఆదరణ కర్త అదృశ్యదైవమా
సత్యస్వరూపివి నీవేనయ్యా
ఆత్మాభిషేకముతో నింపుమా