paahiloaka prabhoa paahi loakaపాహిలోక ప్రభో పాహి లోక ప్రభో
పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో
పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||
1.
నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని
చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||
2.
నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను
భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||
3.
దేవ లోకాధిపతులు దూతల సమూహము
దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||
4.
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
పరలోక సేనాధిపతివైన మా ప్రభో||
5.
ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ
మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||
6.
కెరూబులను దూతలు సెరూపులను దూతలు
తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||
7.
నీ దపొస్తలుల మహిమగల సంఘము
ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||
8.
నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము
సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||
9.
ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు
సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||
10.
నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును
నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్||
11.
ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని
నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||
paahiloaka prabhoa paahi loaka prabhoa
paahi yani vaeAOdu maaM paahiloaka prabhoa||
1.
ninnu sthuthiyiMchuchu neevu prabhuAOda vani
chennumeerAOga nammiyunnaamu sathrpabhoa||
2.
nithya maa thMdri bhooloakM bMthayu ninnu
bhakthithoa naaraaDhiMchuchunnadhi maa prabhoa||
3.
dhaeva loakaaDhipathulu dhoothala samoohamu
dhaevaayani kolchuchunnaaru ninnuAO brabhoa||
4.
parishudhDha parishudhDha parishudhDha prabhuvaa
paraloaka saenaaDhipathivaina maa prabhoa||
5.
ihaloakM bMthayuAO baraloakM bMthayu nee
mahi mahaathmyamuthoa nunnavani prabhoa||
6.
keroobulanu dhoothalu seroopulanu dhoothalu
thiramugaa nin goniyaaduchunnaaru maa prabhoa||
7.
nee dhaposthalula mahimagala sMghamu
proadhigaa ninnuthiMchuchunnadhi maa prabhoa||
8.
nithyamu pravakthala yuththama sMghamu
sathyamuga ninnuthiMchuchunnadhi maa prabhoa||
9.
Dheera hatha saakShula veera sainya mMthayu
saareku ninnuthiMchuchunnadhi maa prabhoa||
10.
nithya mahaathmyamugala thMdri vaina ninnunu
needhu poojyuAOdagu nija adhvitheeya suthinin||
11.
aadharaNa karthayainatti shudhDhaathmuni
nMthata nuMdu sabha yoppukonununin brabhoa||