• waytochurch.com logo
Song # 24954

udayinchinaadu chudu nesthamaa ఉదయించినాడు చూడు నేస్తమా


ఉదయించినాడు చూడు నేస్తమా
లోక రక్షకుడు క్రీస్తేసుగా '2'

సర్వాధికారి ఆయెనే సర్వశక్తిమంతుడు
దీనుడై రిక్తుడై మనుష్యకుమారుడై '2'
నశియించినదానిని వెదకి రక్షించుట కొరకు వచ్చెను '2'
లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా

ఇమ్మానుయేలు దేవుడు ఎన్నడూ నిను విడువడు
మరువడు కునుకడు తోడుగా ఉండువాడు '2'
నలిగినవారికి దుర్గమై ఆశ్రయమిచ్చే అమరుడు '2'
చీకటి బ్రతుకులో వెలుగునింపుటకు నీతి సూర్యుడై

ప్రయాసపడుచు భారము మోయు సమస్త జనులరా
రండి దేవుని ఆశ్రయించుడి ఈ దినమందే '2'
మీ దోషములు అపరాధములు అన్నీ పోవును '2'
శాంతి నెమ్మది సమాధానము ఇచ్చే దయగల దేవుడు

udayinchinaadu chudu nesthamaa
looka rakshakudu kriistugaa

sarvaadhikaari aayane sarvasakthimanthudu
diinudai rikthudai manushyakumaarudai
nasiyinchinadaanini vedaki rakshinchuta koraku vacchenu
lookapaapamunu moosikonipoovu devuni gorrepillagaa

immanuyelu devudu ennaduu ninu viduvadu
maruvadu kunukadu thoodugaa unduvaadu
naliginavaariki durgamai aasrayamicche amarudu
chiikati brathukuloo velugunimputaku niiti suuryudai

prayaasapaduchu bhaaramu moyu samasta janularaa
randi devunu aasrayinchudi ii dinamande
mii dooshamulu aparaadhamulu annii poovunu
saanthi nemmadi samaadhaanamu icche dayagala devudu

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com