• waytochurch.com logo
Song # 24963

వచ్చావయ్యా భువికేతెంచావయ్యా


వచ్చావయ్యా భువికేతెంచావయ్యా
పాపాన్నే పారద్రోలావయ్యా
తెచ్చావయ్యా వెలుగులు తెచ్చావయ్యా
మానవాళికే రక్షణ నిచ్చావయ్యా
నిశిధి రాతిరిలో చలి చలి గాలులలో
సంతోషకరమైన సువర్తమానముతో

1. సత్యమే శరీరధారిగా ఈ లోకమున జనియించెను
వెలుగే కన్నుల బాసటగా ఈ భువిపై ప్రసరించెను
ఆ జీవమే జ్ఞానుల మార్గమై రక్షకుని దరిచేర్చెను
శ్రేష్ఠమైన అర్పణలతో క్రీస్తును కొనియాడిరి
ఆనందమే క్రీస్తు పుట్టెను ఈ లోకానికే సమాధానము
యూదుల రాజా ఆరాధించెదమ్ పూజ్యనీయుడా పూజించెదమ్

Happy christmas merry christmas
We wish you A Happy christmas

2. విధేయతే నీతి చిగురుగా పశులతొట్టెలో పరుండెను
పసిబాలుడె ఇమ్మానుయేలుగా మనకొరకు ఉదయించెను
బేత్లేహేములో పశువులపాకలో పరలోకమహిమ దిగివచ్చెను
సృష్టి అంతా పరవశముతో స్తోత్రములు చెల్లించెను
ఆనందమే క్రీస్తు పుట్టెను ఈ లోకానికే సమాధానము
యూదుల రాజా ఆరాధించెదమ్ పూజ్యనీయుడా పూజించెదమ్

Happy christmas merry christmas
We wish you A Happy christmas

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2022 Waytochurch.com