Bhuvilo Velisina Dhaivama భువిలొ వెలిసిన
భువిలొ వెలిసిన
మా తోడుగా నీవుండుటకు
మా నీడగా నీవుండుటకు
దివిని ఏలే దైవమా
భువిలో వెలసిన రూపమా
హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్
చీకటితో నిండియున్న నా హృదయం
అపవిత్రతను కలిగియున్న నా ఆలోచనలు
దురాశతో నీ దరికిచేరని నా జీవితం
పాపముతో నిను చూడలేని నా కనులకు
క్రీస్తుగా ప్రభు యేసుగా భువికేతించిన దేవా
బాలుడై మా భాగ్యముకై బాటలు వేసితివా
లోకముతో కలిగియున్న నీ స్నేహం
పరిశుద్దతను పొందియున్న నీ ఆలోచనలు
సత్యముతో నా బ్రతుకు మార్చెను నీ జీవితం
రక్షణతో నను ఆదరించిన నీ కరములు
రక్షకా నా విమోచకా నను కరుణించే దేవా
ధరణిలో నీ పూజ్యముకై పుట్టిన యేసయ్యా