• waytochurch.com logo
Song # 24980

Sambaralu Chesedhama సంబరాలు చేసేద్దామా


సంబరాలు చేసేద్దామా

రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరు వాడ కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్...

1) అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరువాడ రండి రండి (2)
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2)
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా


సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)

2)పుట్టుకతోనే రజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2)
జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయు వాడని (2)
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా

సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)

3) వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యను (2)
మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని (2)
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా

సంబరాలు సంబరాలు చేసేద్దామా (4)

సంబరాలు సంబరాలు చేసేద్దామా (5)
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com