• waytochurch.com logo
Song # 24998

devaloka sthothraganam devadhi devuniki nithya dhanam దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం


దేవలోక స్తోత్రగానం – దేవాది దేవునికి నిత్య ధ్యానం (2)

దేవ లోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం – గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)

1.భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు – పూర్తి చేయగల విధానం (2)

భూమికిన్ శాంతిదానం – బొందు దేవష్ట జనం – క్షేమము సమాధానం – క్రీస్తు శిష్య కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)

2.సర్వలోక రక్షణార్థం ఈవార్త – చాటించుట ప్రధానం (2)

సర్వలోక రక్షణార్థం – చాటించుట ప్రధానం – సర్వదేవ సన్నిధానం – సర్వలోక కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)

3.దేవలోక సంస్థానం మహోన్నత – దేవుని మహిమస్థానం (2)

.దేవలోక సంస్థానం – దేవుని మహిమస్థానం – పావన కీర్తి ప్రధానం – భక్త సంఘ కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)

4. జనక పుత్రాత్మ ధ్యానం నరాళి – జగతి చేయు తీర్మానం (2)

జనక పుత్రాత్మ ధ్యానం-జగతి చేయు తీర్మానం- నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం (2)

క్రిస్మస్ జై జై – క్రిస్మస్ జై జై (2) (దేవలోక)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2022 Waytochurch.com