sarvaeshaa rammu nee sannidhi kaamthi nosmgu maaku సర్వేశా రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు
1.
సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు
సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!
2.
నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు
నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర
3.
రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు
రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్
4.
స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ
నేత్రంబులు గను మీ, "త్రాహిమాం" యని వేఁడు వారి
1.
sarvaeshaa! rammu nee sanniDhi kaaMthi nosMgu maaku
sathya sanaathana sarvaaDhikaaruAOdaa sadhaa mammaelumu sarvoannathaa!
2.
nithyMpu vaakyamaa! needhagu khadgamu nimmu maaku
nee nija bhakthulan nee vaakya priyulan niMpu nee yaathmathoa niMpu meera
3.
rammu mahaathma! maa kimmu nee yaathmanu rammu vaega rakthithoa nippudu
rammu maa maDhyaku rakShiMchu mammunu rMjillAOgan
4.
sthoathrM pavithruAOdaa! sthoathrMbu thryaekuMdaa! sthoathrM sadhaa Dhaathri neemahima
naethrMbulu ganu mee, "thraahimaaM" yani vaeAOdu vaari