thellavaarina vaelao dheli vomతెల్లవారిన వేళఁ దెలి వొంది మన
తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె
యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని
మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||
1.
నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్
భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు
మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||
2.
భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ
బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ
డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||
3.
దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్
దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు
శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
4.
పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత
నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ
దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
thellavaarina vaeLAO dheli voMdhi mana kreesthu dhivya naamamuAO baadere
yoa priyulaara dhivasa rakShNa vaeAOdarae thalli rommuna dhaaAOchu pilla reethini
manalAO jalladhanamuga raathi rellAO gaachina vibhuniAO ||dhellavaarina vaeLa||
1.
nidhrapoayina vaeLa nikhilaapadhulAObaapi nishalanni gadupu vibhunin
bhadhramuga vinathiMchi bhayabhakthithoa manamu mudhri thaakShulAO gaelu
moadchi mrokkuchunu ||dhellavaarina vaeLa||
2.
bhaanuAOdudhayM bayyeAO badhmamulu vikasille gaanamalu jaeseAO
bakShul maanasaabjamu lalara manamu kalvari mettapai nekku ninuAO
danedi prabhuAO joochi vaedkan ||dhellavaarina vaeLa||
3.
dhittamuga maanasaeMdhriya kaaya shoaDhanalu pattukoni, yuMdu dhinamun
dhattamuga mana naalgu thatla yaesuni karuNAO juttukoni rakShiMchu
shubhamadugukonuchun ||dhellavaarina vaeLa||
4.
paapa bhaaramu manamu prabhuni pai nidi guruni paadhamulu cheMtha
noragi kaapu kartha vishaala karamu maatuna daaAOgi yaapadhalAO
dholAOgiMchu mani vaeAOdukonuchun ||dhellavaarina vaeLa||