dhaeva neeku sthoathramu ee raదేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో
Chords: ragam: మధ్యమావతి -maDhyamaavathi
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము
నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||
1.
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను
నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||
2.
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ
పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||
3.
నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు
మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||