bheekarumdau maa yehoavaa peetభీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం
Chords: ragam: యమన్-yaman
భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై
సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
1.
మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు
న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||
2.
ఏరితోడు లేక మము సర్వేశ్వరుఁడు సృష్టించెను ధారుణిం దా
నొక్కఁడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ||
3.
పుట్టగిట్టంజేయఁదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా
ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ||
4.
మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల
నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||
5.
మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె
లట్లుఁ దిరుగఁజేర్పన్ మందను ||భీకరుండౌ||