sannuthimthumoa prabhoa sadhamalamagu bh సన్నుతింతుమో ప్రభో సదమలమగు భ
Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu
1.
సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా||
2.
నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా
పాతకజన రక్షకా పతితపావన నామకా|
3.
మానవ సంరక్షకా దీన నిచయ పోషకా
దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా||
4.
ప్రేమ తత్వభోధకా క్షేమదాత వీవెగా
కామిత ఫలదాయక స్వామి యేసు నాయక||
5.
పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్||