prabalamuganae prasthuthimchedప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభు
ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము
నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్ర||
1.
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి
కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||
2.
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున
కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||
3.
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను
గారవించిన నీతిరాజితడే ||ప్ర||
4.
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక
జాలమేలనురా ||ప్ర||
5.
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది
సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||
prabalamuganae prasthuthiMchedha prabhuni krupalanni prathi dhinamu
ninu prachuraparachedha prabhuda naavibhudaa ||pra||
1.
poMdhugoari naa yMdhu nilichina bMDhumithrudavu mMdhamathi
kaa nMdhamosagina mahimathaejudavu ||pra||
2.
chiMthadheerchi naa bhraaMthi maarchithi veMtha viMthadhiyoa svaaMthamuna
kadu shaaMthigoorchithi veMtha karuNadhiyoa ||pra||
3.
neethi karapina jaathi marapina khyaathi yaesunidhae neerasuda nanu
gaaraviMchina neethiraajithadae ||pra||
4.
jeevamichchina jaavavachchina dhaevasutha neevae jeevadhaayaka broavaraa yika
jaalamaelanuraa ||pra||
5.
nimiShnimiShmu ninu bhajiMchedha nemmanMbunanu shamadhamaadhi
suguNashoabhitha sammadhini nimmaa ||pra||