halelooya yani paaduaodee samaహలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెల
హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ
కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము
గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును ||హలెలూయ||
1. హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ
శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక
పారిపోయెను గలిబి లాయెను నరకము ||హలెలూయ||
2. హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ
యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను
బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||
3. హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ
సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము
లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||
4. హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ
యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ
చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము ||హలెలూయ||
5. హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ
బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము
మిమ్ము నాయన కరుణతో నడుపును సదా ||హలెలూయ||
6. హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ
పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ
కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||
7. హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల
నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ
గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||
8. హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ
కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు
సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||
9. హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల
ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ
జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||
halelooya yani paaduAOdee samaaDhipai veluAO gaemo parikiMchuAOdee
kalAOdu yaesu sajeevuAOdayi, lae khanamula lavi neravaerenu kalimi moadhamu
gulaga, dhivi nuthi saluva mahimanu vachchunu ||halelooya||
1. halelooya yani paaAOdudee yee jagathikiAO kalige rakShNa chooduAOdee
shilAO dholMgenu, mudhra vide, kaa vali samaajamu dhaevuni balimi kaagaka
paaripoayenu galibi laayenu narakamu ||halelooya||
2. halelooya yani paaduAOdee cheeAOkatipaini veluAOgae jaya moMdhusuMdee
yilanu mruthyuvu goole, brathikeAOgaa yala vishvaasamu maralanu
balanireekShNa manakuAO galigenu brathihrudhayamu balapaden ||halelooya||
3. halelooya yani paaduAOdee dhuHkhiMchu noa cheliyalaaraa vinuAOdee
solayakuMdAOga meera latunitu choochuchuMduta yevarini phlamu
laedhiAOka brathuku yaesu prabhuni vedhakuta mruthulaloa ||halelooya||
4. halelooya yani paaduAOdee yaesu prabhuni valananae galigeAOganuAOdee
yilayuAO baramunu sakhyapadiyenu galige harShmu chaavuchae siluva
chiMthalu maani, poMdhuAOdi kalakalMbagu moadhamu ||halelooya||
5. halelooya yani paaduAOdee mee bhoori chiM thalutheere madhi nammuAOdee
balaheenapu chinna mMdhaa! prabhuni cheMthaku maralumu kalugu jeevamu
mimmu naayana karuNathoa nadupunu sadhaa ||halelooya||
6. halelooya yani paaduAOdee sMghamu sadhaa nilichi yuMdunu sumMdee
palu therMgula ripula valananu baaDha lenniyuAO galiginan dholAOga
kaemiyu nanni yaddula gelichi varDhilluchuMdunu ||halelooya||
7. halelooya yani paaduAOdee dhaevuni boaDha kulu sarvaraaShtrMbula
nelami mahimakuAO braThama phlamagu yaesu rakShNa vaarthanu veluAO
guvaleAO brasariMpAO jaeyudhu rilanu Dhruthithoa naerputhoa ||halelooya||
8. halelooya yani paaduAOdee bhakthulaaraa vilapiMpavaladhu suMdee
kalugakuMduAOdi sMdhiyMbulu gaduchu kaalamu sheeghramae kalugu meeku
samaaDhi mimmunu gauAOgiliMpa nemmadhi ||halelooya||
9. halelooya yani paaduAOdee goaDhuma giMja vale brathukudhuru meerala
ila prabhuvu thana pMtAO goorpanu naegudheMchunu jivaranu tholAOgAO
jaeyunu gurugulanu goa DhumalanuMdi nijMbugaa ||halelooya||