yaesu laechenu aadhivaaramuna యేసు లేచెను ఆదివారమున యేసు లేచ
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు
లేచెను||
1. వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ
గానే ||యేసు||
2. సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి
లేచె నహహ ||యేసు||
3. మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని
తెల్పి ||యేసు||
4. స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము
తొల్గ ||యేసు||
5. పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద
మొంద ||యేసు||
6. యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ
లేతురండి ||యేసు||
yaesu laechenu aadhivaaramuna yaesu laechenu vaekuvajaamuna yaesu
laechenu||
1. vaekuvajaamuna cheeAOka tuMdAOgaanae yaakaashadhoothalu veekathoa raaAO
gaanae ||yaesu||
2. samaaDhipai raathin svaami dhootha lidhdharu samamugAO dheeyanu svaami
laeche nahaha ||yaesu||
3. mruthulaloa sajeevun vethaku taela nani dhoothalu vaarithoa dhaatha laeAOdani
thelpi ||yaesu||
4. sthreelu vaega veLli shiShyulakuAO dhelpa jiMtha maaripoayi sMdhaehamu
tholga ||yaesu||
5. paethuru yoahaanul parugeththukoni vachchi pravaeshiMchi guhaloa paramaanMdha
moMdha ||yaesu||
6. yaesu chachchi laeche yaesu shiShyulatlae dhoasMbulakuAO jachchi vaasiga
laethurMdi ||yaesu||