kreesthu laechenu hallelooya kక్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస
క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్నులేపును ఇద్దియె సునాద సత్యము
ఇలను చాటుడి నిత్యము||
1. మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు
లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది||
2. పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను పాపినగు నను బ్రోవ
క్రీస్తుని ప్రాణదాన ప్రభావము||
3. మరణమా! నీముల్లు యెక్కడ? మరణమా! జయమెక్కడ? మరణమా!
నీముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు ||
4. శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలాయెను రాత్రిలో ఇలయు
పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో ||
5. మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము ప్రేతలను
జీవింపచేయును పృథివి క్రీస్తుని విజయము ||
6. స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా స్వంత
రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి ||
kreesthu laechenu hallelooya kreesthu nannulaepunu idhdhiye sunaadha sathyamu
ilanu chaatudi nithyamu||
1. mruthula punaruthThaana pMtaku praThama phlamagu kreesthuloa mruthulu
laethuru naenu laethunu naadhuvarusaloa nijamidhi||
2. paapamaraNa narakabalamulu prabhuni shakthiki oadenu paapinagu nanu broava
kreesthuni praaNadhaana prabhaavamu||
3. maraNamaa! neemullu yekkada? maraNamaa! jayamekkada? maraNamaa!
neemullu virigenu mahima kreesthuloa nippudu ||
4. shilayu mudhrayu balimikaavali galibilaayenu raathriloa ilayu
paramunu kalusukoniyenu gelupunoMdhina kreesthuloa ||
5. mruthulu needhaguvaaralMdharu brathiki laethuru sathyamu praethalanu
jeeviMpachaeyunu pruThivi kreesthuni vijayamu ||
6. sthuthiyu mahimayu ghanatha neeke sthuthiki paathruda rakShkaa svMtha
rakthamu chiMdhithivi naa svaami yidhenaa yMjali ||