parama prabhoa yaesurakshkaa dపరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్
పరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్రోచి పరమ కారోహణంబైతివా
మరియయందు జననమొంది వరము లిడుచు దిరిగిధరను మరణమొంది
తిరిగిలేచి పరము కేగితివా ప్రభో ||పరమ||
1. ఘోర పాపభారముతోడ దరిగానలేకఁ దిరుగుచుండినట్టి మమ్మును
కూరిమితోఁ దరికిఁబిలిచి భారమును నీవేమోసి ఊరకమము క్షమియించి
నేరములను బాపిన ప్రభో ||పరమ||
2. సిలువమరణమొందినఁ ప్రభువా ఇలనరుల ఘోర కలుషములను బాపిన
ప్రభువా విలువలేని నీదు బ్రతుకు బలముగల నీ ప్రేమ సేవ సలితముగ
ననుకరించి ఇలను మేము బ్రతుకునట్లు ||పరమ||
3. చెఱను చెఱగఁబట్టిన ప్రభువా ధనరులకెల్ల వరములను విరివి నిడితివా
పరముకేగి పరమతండ్రి పరమున కుడిపార్శ్వమందుఁ దిరముగాఁ
గూర్చుండి యుండి తిరిగి ధరకు వచ్చెదవా ||పరమ||
4. నీదు రాక కెదురుజూచెడి నీ దాసులను సదయతతో జూడుమో ప్రభో
మాదినపు ప్రార్థనలను మాదు స్తోత్రములను మిగులఁ బ్రోదిగా గైకొనుచు
నేడు బ్రోవుమయ్య మమ్ములను ||పరమ||
5. పంపుమయ్య నీదు ఆత్మను పదిలముగ దయతో సొంపుగ నీ శుద్ధాత్మను
నింపుమయ్య నీదు కృపతో ఇంపగు నీవరములతో సొంపు గాను నీదు
సేవ జేయనిలను నెల్లపుడు ||పరమ||
parama prabhoa yaesurakShkaa Dhananarula broachi parama kaaroahaNMbaithivaa
mariyayMdhu jananamoMdhi varamu liduchu dhirigiDharanu maraNamoMdhi
thirigilaechi paramu kaegithivaa prabhoa ||parama||
1. ghoara paapabhaaramuthoada dharigaanalaekAO dhiruguchuMdinatti mammunu
koorimithoaAO dharikiAObilichi bhaaramunu neevaemoasi oorakamamu kShmiyiMchi
naeramulanu baapina prabhoa ||parama||
2. siluvamaraNamoMdhinAO prabhuvaa ilanarula ghoara kaluShmulanu baapina
prabhuvaa viluvalaeni needhu brathuku balamugala nee praema saeva salithamuga
nanukariMchi ilanu maemu brathukunatlu ||parama||
3. cheRanu cheRagAObattina prabhuvaa Dhanarulakella varamulanu virivi nidithivaa
paramukaegi paramathMdri paramuna kudipaarshvamMdhuAO dhiramugaaAO
goorchuMdi yuMdi thirigi Dharaku vachchedhavaa ||parama||
4. needhu raaka kedhurujoochedi nee dhaasulanu sadhayathathoa joodumoa prabhoa
maadhinapu praarThanalanu maadhu sthoathramulanu migulAO broadhigaa gaikonuchu
naedu broavumayya mammulanu ||parama||
5. pMpumayya needhu aathmanu padhilamuga dhayathoa soMpuga nee shudhDhaathmanu
niMpumayya needhu krupathoa iMpagu neevaramulathoa soMpu gaanu needhu
saeva jaeyanilanu nellapudu ||parama||