parishudhdhaathma prabhuni varపరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక
పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం ధురము ధరణికిజీవ సంజీవము
పరమౌన్నత్యంబైన పరలోక సువిశేష పరమార్థములు దెలుపు నెఱిమార్గము
||పరి||
1. ఆపత్కాలమునందు ప్రాపయి మానవజాతి కాపయి సంరక్షించి
ఏపారును పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు పాపజాతికి దీప
రాశియై రహియించు కృపయు కనికరములు గుంఫించి మధురాతి
ప్రభగా భాసిల్లెడు పరమార్థము అపభ్రంశకార్యముల కెపుడు తావీయక
సుపురోగతిని జూపి శోధించును ||పరి||
2. బండలనుపమించు గుండియల కదలించు నిండుశక్తి ఘటించు నీతి
బెంచు ఎండిన యెదలను నిండించు రక్షణో ద్దండ విలసిత భాగ్య దానమ్ములు
దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము మేళవించి
మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల నుండి పాపిని గాచు నండయౌచు
||పరి||
3. శాంతి సమాధాన సౌజన్యభావమ్ము కాంతిమంతము గల్గు కారుణ్యము
అంతములేనట్టి ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు ఎంతో
సంతోషముతో అంతుబొంతులేని వి క్రాంతి బలత్యాగముల గావింప
జేయు చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు శాంతిలేని జనతకు
సౌఖ్యాస్పదము ||పరి||
parishudhDhaathma prabhuni varadhivyashakthibM Dhuramu DharaNikijeeva sMjeevamu
paramaunnathyMbaina paraloaka suvishaeSh paramaarThamulu dhelupu neRimaargamu
||pari||
1. aapathkaalamunMdhu praapayi maanavajaathi kaapayi sMrakShiMchi
aepaarunu paapaaMDhakaaramuna badi mraggi shoakiMchu paapajaathiki dheepa
raashiyai rahiyiMchu krupayu kanikaramulu guMphiMchi maDhuraathi
prabhagaa bhaasilledu paramaarThamu apabhrMshakaaryamula kepudu thaaveeyaka
supuroagathini joopi shoaDhiMchunu ||pari||
2. bMdalanupamiMchu guMdiyala kadhaliMchu niMdushakthi ghatiMchu neethi
beMchu eMdina yedhalanu niMdiMchu rakShNoa dhdhMda vilasitha bhaagya dhaanammulu
dhMdigaanasamaana Dhairyoathsaahamulichchi meMdugaa naadharamu maeLaviMchi
mMduchunna paapa maraNaagni jvaalala nuMdi paapini gaachu nMdayauchu
||pari||
3. shaaMthi samaaDhaana saujanyabhaavammu kaaMthimMthamu galgu kaaruNyamu
aMthamulaenatti aanMdha shudhDhaathma shaaMthidhaaMthiyosMgi sMrakShiMchu eMthoa
sMthoaShmuthoa aMthuboMthulaeni vi kraaMthi balathyaagamula gaaviMpa
jaeyu chiMthaa DhvaaMthamuloana chedharikottukapoavu shaaMthilaeni janathaku
saukhyaaspadhamu ||pari||