aathmaa nadupu sa thyamu loaniఆత్మా నడుపు స త్యము లోని కిపుడ
Chords: ragam: ముఖారి-mukhaari
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ
సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||
1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు
నట్టులను ||ఆత్మా||
2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు
వెలుఁగుటకు ||ఆత్మా||
3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ
గూర్చి దీవించి ||ఆత్మా||
4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక
రంబు నిచ్చి ||ఆత్మా||
5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన
||ఆత్మా||