sukha michchegadha maaku prabhసుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా
సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా నీ సురుచిరమగు వాక్కు
నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత
వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||
1. జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ
మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత
మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||
2. నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు
ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ
బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చె||
sukha michchegadha maaku prabhuyaesuvaa nee suruchiramagu vaakku
nikhilakalmaSh vanamunaku dhava shikhi shikhilavale gaalchu needhagu mukhavikaasitha
vaakyamulu bahu sukhamu losAOgu thavaashrithaaLiki ||sukha michche||
1. jagathiloapala meMduga nuMdina viviDha magu shaasthramulu joodAOga
migula gMdharagoaLamai mari yokati kokati virudhDhamuga ma rthyagaNa kalpitha
maguchu nunnavi thagani vani dhroachithimi vaatini ||sukha michche||
2. nee vaakyamula bhaavamu nammina paapi jeevula kadhi jeevamu kaevalM bagu
Dharmashaasthramu dhaevuAO dichchina dhokati baibilu ee vasuDhAOgala sarva paapulAO
broava vachchina ninnuAO joopenu ||sukha michche||