• waytochurch.com logo
Song # 2580

smgha shirasai velayu prabhuvaసంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృ


Chords: ragam: బేహాగ్-baehaag

సంఘ శిరసై వెలయు ప్రభువా సత్యకృప సంపూర్ణ ప్రభావా సర్వ
క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ||

1. సంఘ యస్థిభారము వీవే సంఘ జీవాధారము నీవే సర్వ జనరక్షణము
నీవే సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ||


2. తరణి చుట్టు తారాగ్రహములు పరివృత్తంబై తిరుగు రీతిని తల యె
క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ||


3. నూతనాత్మ నూతన జన్మ నీతి సేవా నిరతియు గలిగి నిత్య మాతనియందు
నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ||


4. ఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి ఆత్మఫలములు
జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు ||సంఘ||


5. విశ్వసింతుము నిన్నే మేము విమల జీవ ప్రదాయకుండ వరుడనీవై
వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా ||సంఘ||

sMgha shirasai velayu prabhuvaa sathyakrupa sMpoorNa prabhaavaa sarva
kraisthava sMgha mahi maa sthroathrageethal sveekariMpumaa ||sMgha||

1. sMgha yasThibhaaramu veevae sMgha jeevaaDhaaramu neevae sarva janarakShNamu
neevae sarvaloaka nireekShNa neevae ||sMgha||


2. tharaNi chuttu thaaraagrahamulu parivruththMbai thirugu reethini thala ye
kreesthaya thanuvae bhakthulai thagina sakhyatha naikyatha nuMdhuru ||sMgha||


3. noothanaathma noothana janma neethi saevaa nirathiyu galigi nithya maathaniyMdhu
nilachi negadu vaarae nijakraisthavulu ||sMgha||


4. aathmashudhDhi anupamabudhDhi amalavarthana manishamu galigi aathmaphlamulu
jaapana naerchina yanu bhavMbae kraisthavMbu ||sMgha||


5. vishvasiMthumu ninnae maemu vimala jeeva pradhaayakuMda varudaneevai
varadhuda veevai vishva bhaarathi nudhDhariMpumaa ||sMgha||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com