dheevenala nidu dhaevaa needhuదీవెనల నిడు దేవా నీదు సేవకై వె
దీవెనల నిడు దేవా నీదు సేవకై వెడలెడు దీనులపైఁ పావనాత్మ నంపుము
పనులలో నడిపింపుము కేవలంబుగ మా తనువులు నీ సేవకై యర్పింప
గజేయుము ||దీవెనల||
1. మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి
మేటి క్రీస్తుని నామా మృతముఁ గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై
పనులు సల్ప(గ బంపుము కృపచే ||దీవెనల||
2. దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింపఁ
బరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ
మర్మముల ||దీవెనల||
3. దురిత రోగాదులచే మిగులఁ తూలి చను మనుజాళికి నీవే పరమ
విశ్రాంతి నిడు వరదుఁడ వంచుఁగడు వెరవునను బోధింపంగను నీ
వర ములతో నింపుము దాసులను ||దీవెనల||
4. గ్రామ సంఘంబులను బడుల క్షేమముగఁ గాపాడి పెంప ఓ మహాత్మ
నీ కృప తో మమ్ముఁ గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము
మనగను బ్రోవు మామేన్ ||దీవెనల||
dheevenala nidu dhaevaa needhu saevakai vedaledu dheenulapaiAO paavanaathma nMpumu
panulaloa nadipiMpumu kaevalMbuga maa thanuvulu nee saevakai yarpiMpa
gajaeyumu ||dheevenala||
1. maatimaatiki baapayuthMbau maargamunAO janu manasulAO dhruMchi
maeti kreesthuni naamaa mruthamuAO groaluchu maemaa paatuna naathmala rakShNakai
panulu salpa(ga bMpumu krupachae ||dheevenala||
2. dhivya boaDha ledhanu galgi dheenathanu rakShNa maargamunu bhavyamuga boaDhiMpAO
baramaarTha meRigiMpa saevya naerpave dhina dhinamunu nee saevakaaLiki nee
marmamula ||dheevenala||
3. dhuritha roagaadhulachae migulAO thooli chanu manujaaLiki neevae parama
vishraaMthi nidu varadhuAOda vMchuAOgadu veravunanu boaDhiMpMganu nee
vara mulathoa niMpumu dhaasulanu ||dheevenala||
4. graama sMghMbulanu badula kShaemamugAO gaapaadi peMpa oa mahaathma
nee krupa thoa mammuAO gaachi sadhaa svaami maaloa neevunu neeloa maemu
managanu broavu maamaen ||dheevenala||