greenlaamd dhaeshasthulunu imdiyగ్రీన్లాండ్ దేశస్థులును ఇండియ
1. గ్రీన్లాండ్ దేశస్థులును
ఇండియా జనులున్
ఆఫ్రికా ఖండమందు
నివాసులెల్లరు
సముద్ర ద్వీపస్థులు
సువార్త వెలుగు
మాకు నిప్పించుడని
మమ్మును పిల్తురు.
2. మా దేవుడిచ్చు సుఖ
సుక్షేమ యీవులు
ఒక్కొక్క దేశమందు
విస్తారమైనను
అజ్ఞానులైనవార
లా సత్య దేవుని
గొల్వక వేరువాటిన్
పూజించుచుందును.
3. సువార్తకాంతి మాకు
ప్రకాశమైనదా
అజ్ఞానులందరికి
దాని మేమియ్యమా
రక్షణ దివ్యవార్త
లోకస్తులెల్లరు
విని మా యేసుమీద
విశ్వాసులౌదురు.
4. సుక్షేమకరమైన
సువార్త సంగతి
గాలి తరంగములు
వ్యాపింపజేయుడీ
మా సృష్టికర్త రాజు
నిర్దోషి యాయనే
మా యేసు దిగి వచ్చి
యీ లోకమేలును.
1. greenlaaMd dhaeshasThulunu
iMdiyaa janulun
aaphrikaa khMdamMdhu
nivaasulellaru
samudhra dhveepasThulu
suvaartha velugu
maaku nippiMchudani
mammunu pilthuru.
2. maa dhaevudichchu sukha
sukShaema yeevulu
okkokka dhaeshamMdhu
visthaaramainanu
ajnYaanulainavaara
laa sathya dhaevuni
golvaka vaeruvaatin
poojiMchuchuMdhunu.
3. suvaarthakaaMthi maaku
prakaashamainadhaa
ajnYaanulMdhariki
dhaani maemiyyamaa
rakShNa dhivyavaartha
loakasthulellaru
vini maa yaesumeedha
vishvaasulaudhuru.
4. sukShaemakaramaina
suvaartha sMgathi
gaali tharMgamulu
vyaapiMpajaeyudee
maa sruShtikartha raaju
nirdhoaShi yaayanae
maa yaesu dhigi vachchi
yee loakamaelunu.