yaesoo nin joothu nimdhuao dhaetagaa యేసూ నిన్ జూతు నిందుఁ దేటగా
1. యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా
అగోచరార్థముల్ నే ముట్టదున్
కృపన్ నేఁ బట్టకొందు గట్టిగా
నీ మీఁద వేయుదున్ నా భారము.
2. నే దైవాహార మిందె తిందును
ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్
భూభారముల్ నేఁ బారవేయు దున్
క్షమా సౌఖ్యంబు గల్గుఁ క్రొత్తగా.
3. సంగీత భోజనాల కాలము
ప్రభుండు నాకై బల్ల వేసెను
విందారగించుచున్ నీ తోడి నా
మాధుర్య స్వల్ప మైత్ర్రిన్ బెంచుదున్.
4. సాయం బీవే, వేరే నా కెందుకు
వేరే చేమీఁద నానుకొనను
ప్రభూ, నిజంబుగా నీదే చాలును
నీ శక్తిలోనె బలం బుండున్
5. పాపంబు నాది, నీతి నీదెగా
నేరంబు నాది శుద్ధి నీదెగా
నీ రక్త నీతియే నా వస్త్రముల్
నా కాశ్రయంబు శాంతస్థితులు