dhaeva dheenapaapini oa paavaదేవ దీనపాపిని ఓ పావన గావు కృప
దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత ||దేవా||
1. ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు
జేయవె తండ్రీ! ||దేవ||
2. నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని
||దేవ||
3. నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను
ద్రుంచుచున్నది ||దేవ||
4. పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది
తల్లి ||దేవ||
5. ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన
మొదవ జేతువు నాకు ||దేవ||
6. కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు
నిలుపు మాంతర్యమున ||దేవ||
7. త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ
శుద్ధాత్మను నాలో ||దేవ||
8. నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా
మనసు ||దేవ||
9. కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ
జేసెద ||దేవ||
10. ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ
విప్పు నా పెదవులను ||దేవ||
11. కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు
నీకు ||దేవ||
12. విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ
మతి ప్రియంబౌ నీకు ||దేవ||
dhaeva! dheenapaapini oa paavana gaavu krupaa bahuLyamu chaetha ||dhaevaa||
1. khaludanoa dhaevaa! naa niluvella paapMbe malinathvamunu baapi maanyu
jaeyave thMdree! ||dhaeva||
2. neeku kaevalMbu neekae viroaDhamuga praakoni nae ghoara paapM bonarchithini
||dhaeva||
3. naayathikrama mepdu naa yedhuta nunnadhi naa yedhanu bhaarMbai nanu
dhruMchuchunnadhi ||dhaeva||
4. paapMbuloanae yu dhbhaviMchinaadanu paapMbuloanae ga rbhamu dhaalchinadhi
thalli ||dhaeva||
5. edhayMdhu sathyMbae yedAOgoaru chuMdhuvu hrudhayamMdhuna jnYaana
modhava jaethuvu naaku ||dhaeva||
6. kaligiMchu naaloa ni rmala shudhDha hrudhayMbu nilukadaina manasu
nilupu maaMtharyamuna ||dhaeva||
7. throasivaeyaku nannu nee sanniDhi nuMdi theesivaeyaka nuMchu mee
shudhDhaathmanu naaloa ||dhaeva||
8. nee rakShNaanMdha moa rakShkaa marala chaeradheesi yichchi sThiraparachu naa
manasu ||dhaeva||
9. kaavavae karthaara kthaaparaaDhamunuMdi kaavu nae nuthsaaha gaanMbuAO
jaesedha ||dhaeva||
10. prabhuva! naa noarunin prasthuthiMchuchu sadhaa vibhavamugAO goniyaada
vippu naa pedhavulanu ||dhaeva||
11. koaruvaaAOdavu kaavee vaaraya narpaNalu koarina narpiMthu koati balulu
neeku ||dhaeva||
12. viRigina manasae nee vilasitha yarpaNamu araya naligina hrudhaya
mathi priyMbau neeku ||dhaeva||