• waytochurch.com logo
Song # 266

prabhu yesu naa rakshakaa ప్రభు యేసు నా రక్షకా


ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||

ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||

విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||

కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||

లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

Prabhu Yesu Naa Rakshakaa
Nosagu Kannulu Naaku
Nirathamu Ne Ninnu Jooda (2)
Alphayu Neeve Omegayu Neeve (2) ||Prabhu Yesu||

Priyudaina Yohaanu Pathmaasulo
Priyamaina Yesu Nee Swaroopamu (2)
Priyamaara Joochi Bahu Dhanyudayye
Priya Prabhu Ninnu Joodanimmu (2) ||Prabhu Yesu||

Lekkaleni Maarlu Padipothini
Dikkulenivaada Nenaithini (2)
Chakkajesi Naa Nethraalu Derachi
Grakkuna Ninnu Joodanimmu (2) ||Prabhu Yesu||
Erigi Yerigi Ne Chedipothini
Yesu Nee Gaayamu Repithini (2)
Mosapothi Nenu Drushti Dolagithi
Daasuda Nannu Joodanimmu (2) ||Prabhu Yesu||

Endaresuni Vaipu Choochedaro
Pondedaru Velgu Mukhamuna (2)
Sandiyambu Leka Santhoshinchuchu
Munduku Parugeththedaru (2) ||Prabhu Yesu||

Vishwaasakarthaa O Yesu Prabhuu
Konasaaginchuvaadaa Yesu Prabhuu (2)
Vinayamutho Nenu Nee Vaipu Joochuchu
Visugaka Parugeththa Nerpu (2) ||Prabhu Yesu||

Kantiki Kanabadani Venniyo
Cheviki Vinabadani Venniyo (2)
Hrudaya Gocharamu Kaani Venniyo
Sidhdhaparachithiva Naakai (2) ||Prabhu Yesu||

Loka Bhogaalapai Naa Nethraalu
Sokakundunatlu Krupa Joopumu (2)
Nee Mahima Divya Swaroopamunu
Nindaara Nanu Joodanimmu (2) ||Prabhu Yesu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com