kreesthu yoadhulaaraa yudhdha maaduaoక్రీస్తు యోధులారా యుద్ధ మాడుఁ
1. క్రీస్తు యోధులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు సిల్వ మీరు
పట్టి గెల్వుఁడీ
మన రాజు క్రీస్తు
దండు నడ్పును
చూడు మాకు ముందు
క్రీస్తు ధ్వజము.
|| క్రీస్తు వీరులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు ధ్వజ మెత్తి
జయ మొందుఁడీ ||
2. లోక రాజ్య కీర్తి
వాడిపోవును
క్రీస్తు రాజ్యమైన
నిత్య ముండును
సాతా నాధిపత్య
మాఁగిపోవును
క్రీస్తు దివ్య సభ
జయ మొందును.
3. ఓ జనంబులారా
వచ్చి చేరుఁడీ
జయ కీర్తనంబు
లెత్తి పాడుఁడీ
కీర్తి, స్తుతి, ఘవ
మెన్నఁ డుండును
మన క్రీస్తు రాజు
నిత్య మేలును.