• waytochurch.com logo
Song # 2675

smthoashimpare priyulaaraa yaeసంతోషింపరె ప్రియులారా యేసుని చ


Chords: ragam: కళ్యాణి-kaLyaaNi

సంతోషింపరె ప్రియులారా యేసుని చెంత సంతసింపరె మనసార
ఎంతో ప్రేమించి య నంతు డొసగెను సుతుని వింతగ బ్రతుకువ సంత
శోభను దాల్చె అంతరంగములో వసించిన చింత లెల్లను వాడ బారెను
గంతు లిడుచును నూత్నజీవ ల తాంతములు పూయంగ దొడగెను ||సంతో||

1. సిలువలో వలరారిన యేసునిప్రేమ ఫలియించె హృది వనమున
కలుష మెల్లను బాపు కలువరిలో భక్తి పలవులు చిగిరించి చెలుని పాద
పద్మములు అలుముకొని యా రాధనంబున మలయ మారుత వీచికలపై
మలపు గొనుచు సమర్పణంబును సులలితముగా జేయ దొడగెను ||సంతో||


2. పాపతాపము తొలగెను జీవితపు తుఫానులన్నియు నణగెను ప్రాచీన
సర్పము పగబట్టి పడగెత్తి పంతమున ననుడాసి పటువున కఱవంగా
పాప మరణపు విఱుగుడగునా ప్రభుని యమృత రక్తసారము ప్రాణ భిక్షను
బెట్టెను మరి పగతుని యోడించె న హాహా ||సంతో||


3. యాత్ర పథమున యేసుడు ప్రకాశింప రాత్రియె పగలాయెను నేత్రములు
వికసింప ధాత్రి నా బసలోప విత్ర వాక్యములో వి చిత్ర కృపలను గాంచి
గాత్ర వీణను మీటి దేవుని స్తోత్ర గీతము పాడి పుణ్య క్షేత్ర పథమున
బోవ యేసుడు మిత్రుడై నడిపింప దొడగెను ||సంతో||


4. సిరిసంపదలు యున్నను లేకున్నను కఱుణావరములు తరుగవు
పైరు పంటలు గాని పరువు ప్రతిష్టలు కఱువైనగానినే మురియుదు
మదిలోన గిరులపైనను పరుగు లిడుటకు హరిణ పాదము లొసగె యేసుడు
వెఱతునా చింతింతునా క ల్వరిని ప్రేమలు కురియుచుండగ ||సంతో||

sMthoaShiMpare priyulaaraa yaesuni cheMtha sMthasiMpare manasaara
eMthoa praemiMchi ya nMthu dosagenu suthuni viMthaga brathukuva sMtha
shoabhanu dhaalche aMtharMgamuloa vasiMchina chiMtha lellanu vaada baarenu
gMthu liduchunu noothnajeeva la thaaMthamulu pooyMga dhodagenu ||sMthoa||

1. siluvaloa valaraarina yaesunipraema phliyiMche hrudhi vanamuna
kaluSh mellanu baapu kaluvariloa bhakthi palavulu chigiriMchi cheluni paadha
padhmamulu alumukoni yaa raaDhanMbuna malaya maarutha veechikalapai
malapu gonuchu samarpaNMbunu sulalithamugaa jaeya dhodagenu ||sMthoa||


2. paapathaapamu tholagenu jeevithapu thuphaanulanniyu naNagenu praacheena
sarpamu pagabatti padageththi pMthamuna nanudaasi patuvuna kaRavMgaa
paapa maraNapu viRugudagunaa prabhuni yamrutha rakthasaaramu praaNa bhikShnu
bettenu mari pagathuni yoadiMche na haahaa ||sMthoa||


3. yaathra paThamuna yaesudu prakaashiMpa raathriye pagalaayenu naethramulu
vikasiMpa Dhaathri naa basaloapa vithra vaakyamuloa vi chithra krupalanu gaaMchi
gaathra veeNanu meeti dhaevuni sthoathra geethamu paadi puNya kShaethra paThamuna
boava yaesudu mithrudai nadipiMpa dhodagenu ||sMthoa||


4. sirisMpadhalu yunnanu laekunnanu kaRuNaavaramulu tharugavu
pairu pMtalu gaani paruvu prathiShtalu kaRuvainagaaninae muriyudhu
madhiloana girulapainanu parugu lidutaku hariNa paadhamu losage yaesudu
veRathunaa chiMthiMthunaa ka lvarini praemalu kuriyuchuMdaga ||sMthoa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com