nee kanna niaoka vaerae vaelpuనీ కన్న నిఁక వేరే వేల్పులు లేర
నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ
కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ
నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న||
1. నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము
లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక
యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న||
2. వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి
తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా
హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక ||నీ కన్న||
3. నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె
సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు
లేరు కావవే నను యేసునాయక ||నీ కన్న||
nee kanna niAOka vaerae vaelpulu laerayyaa nijamugaa naa yaesuvaa nee
karuNa yanu nenaruchaethanu needhu sathya suvaartha dhvaara praakatMbuga
nannuAO bilichina loaka rakShka neeku mrokkedha ||nee kanna||
1. ninnuAO dheliyaka munnu nanya dhaivMbula nanusariMchina paapamu
lanni penagoni naadhu hrudhayapuAO gannu AO grammi prakaasha miyyaka
yunna nee vimalaathma varamuna nannu veligiAOchina dhayaaniDhi ||nee kanna||
2. vadhalaka naeAO jaeyu thudha laeni paapamu vadhaliMchi nanuAO broachithi
thudhidhinMbunAO galugu baaDhaluAO dholAOga jaeyuta neeva yani naa
hrudhayamMdhuna naa nireekShNa padhilaparachina bhaktha paalaka ||nee kanna||
3. nee vaakyaarThamu naaloa nivasiMpAO jaesi nee saevakunigAO broavavae neeve
sathyamu neeve jeevamu neeve maargamu neeve dhvaaramu neevu gaakiM kevaru
laeru kaavavae nanu yaesunaayaka ||nee kanna||