naenu kreesthu prabhuni jaeri నేను క్రీస్తు ప్రభుని జేరి నేన
నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన
నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు ||నే||
1. నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు
నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు ||నే||
2. నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి
నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను ||నే||
3. నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె
నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు ||నే||
4. నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న
నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ ||నే||
naenu kreesthu prabhuni jaeri naenu kreesthuvaada naudhu naenu kreesthu soththu gaana
naenu naa samasthamunu naaDhu daesu kipudu yiththu ||nae||
1. naenu kreesthu nanubhaviMchi naenu kreesthu boaliyuMdhu naenu naa svaroopamMdhu
naa prabhuMdu gaanupiMpa naenu naesuloa vasiMthu ||nae||
2. naenu kreesthunMdhunuMdi naenu kreesthuloa berugudhu naenu kreesthu dhaarinadachi
naenu kreesthu manasu nepudu gaanupaRathu nelledanu ||nae||
3. naenu kreesthu saevajaesi naenu kreesthu saakShinaudhu naenu kreesthu saaDha nMbe
naenu yanubhaviMchu rakSh NaanMdhMbu jaatedhepudu ||nae||
4. naenu praaNamaina nichchi naenu kreesthukai brathukudhu naenu, kreesthu kalisiyunna
naashana thanayuni shakthi naelagoolu nadhbhuthamuga ||nae||