devaa neevu chesina melulenno దేవా నీవు చేసిన మేళులెన్నో
దేవా నీవు చేసిన మేళులెన్నో
నాకై నీవు చూపిన ప్రేమ ఎంతో
ఒకటని రెండని చెప్పుటకు లేవయ్య
నా జీవిత యాత్రలో
ప్రతి దినం ప్రతి క్షణం
చేస్తునే ఉన్నావయ్యా మేలులను
యేసయ్య స్తోత్రమయ్యా
ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావు
రక్షకుడై నను రక్షించి
ఎందరికో లేని ఆనందం నాకు ఇచ్చావు
స్తుతింప నేర్పించి
నీ కాడిని మోసే కృపను ఇచ్చావు
తండ్రివై నను ప్రేమించి
నీ నామం ఘనపరచే కృపను ఇచ్చావు
నీ పాత్రగా నను మలచి
నీ పాత్రగా నను చేసి