devaa maa praarthana vinavaa దేవా మా ప్రార్థన వినవా
దేవా మా ప్రార్థన వినవా
ఆవేదన ఆలకించవా
నీ ప్రజల కన్నీరు చూచి
దాటి వెళ్లకు ప్రభువా
మా దేశ క్షేమము చూసే
ఆశ్రయమైన దేవుడవు
సుర్యుడే లేక వేకువ రాదే
కెరటాలు లేక సాగరము కాదే
నీవు లేక జీవించగలమా
కానరాక వ్యాధి మూలం
దేశమంత శిలగ మారే
కనులకాంతి చీకటాయే
దేశశాంతి మూగబోయే
జనులఘోష గగనమంతే
ఘోర శిక్ష బారమాయే
నీవే రావా కన్నీరు చూసి
రక్షింపుము మా దేశమును
దయ చూపవా యేసయ్య