bhoomyaakaasamulanu srujinchina devaa భూమ్యాకాశములను సృజియించిన దేవా
భూమ్యాకాశములను సృజియించిన దేవా
నీ సన్నిధిలోనే ప్రవేశించెదను
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా.. నీకే వందనం
మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు
వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు
నీ కౌగిలిలో నను హత్తుకొని
అర చేతులలో నను చెక్కుకొని
నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు
ఏమివ్వగలను నేను నీ ప్రేమకై
పగిలిన హృదయముతో ఆరాధింతును
ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు
సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు
నా మనో నేత్రమును వెలిగించి
నా హృదయ కాఠిన్యమును మార్చి
అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును
విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును
O God, who created Heaven and Earth! I will enter into Your presence To shine Your Holiness Make me walk in Your completeness Glory and Honor to You Every day my worship is to You Glory and Honor to You Always this praise offering is to You Jesus.. Thank You From dust, You have formed me as a human Though I was an empty, You have filled me with Glory You have hugged me You have engraved me on the palms of Your hands And You have shined Your face upon me What can I give for Your Love I worship You with my broken heart How much You have loved this deadly sinner You have changed me strangely by dying on the Cross You have enlightened eyes of my heart You have changed hardness of my soul And You have chosen me who is unworthy and weak How can I pay back Your debt I worship You with my broken and contrite spirit