viluveleni na jeevitham nee chethilo padagane విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే
విలువేలేని నా జీవితం, నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు,
నీ జీవితాన్నే దారబోసితివే
Chorus:
నీది శాశ్వత ప్రేమయ – నేను మరచిపోలేనయ
ఎన్ని యుగాలైన – మారదు.. – ఎండిన ప్రతి మోడును
మరల చిగురించును – నా దేవునికి సమస్తము – సాధ్యమే….
పాపములో పడిన నన్ను – శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే – రోగమే నన్ను చుట్టుకొని యుండగ
రోధనతో ఒంటరినై యుండగ – నా కన్నీటిని తుడిచితివే
పగలంతా మేఘస్తంభమై, – రాత్రంతా అగ్నిస్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పిటివే… – స్నేహితులే నన్ను వదిలేసిన
బంధువులే భారమని తలచిన – నా కొరకే బలియైతివే
Bridge:
సాధ్యమే.. సాధ్యమే… సాధ్యమే నా యేసుకు సమస్తము
సాధ్యమే.. సాధ్యమే… సాధ్యమే నా ప్రియునికి సమస్తము
ఎండిన ప్రతి మోడును – మరల చిగురించును
నా దేవునికి సమస్తము – సాధ్యమే….