paradhaeshi punyakshaethra yaathrao bపరదేశి పుణ్యక్షేత్ర యాత్రఁ బ
1. పరదేశి, పుణ్యక్షేత్ర
యాత్రఁ బోవుచుందువా?
యేసు నాజ్ఞ తల పోసి
మోక్ష మొందఁ బోదును.
కొండ లెక్కి యేళ్లు దాఁటి
మోక్ష రాజ్యం చేరుదాఁక
ముందు పోవుచుందును.
2. ఒంటిగాను బోవుదువే
నీకు భయ ముండదా?
లేదు నాకు భయమేల?
స్వామి నన్ను ఁ గాచును;
మోక్ష రాజ్యం చేరుదాఁక
యేసు నాకుఁ దోవచూప
ముందు పోవుచుందును.
3. పరదేశి, మోక్షమందు
నీకు లాభ ముండునా?
నిత్యానంద సువిశ్రాంతి
యందు నుండు లాభము.
జీవనది నీళ్లు త్రాగి
యేసుతో సదా వసింప
ముందు పోవుచుందును
4. పరదేశి, నీతో నేను
యాత్ర చేయ వచ్చునా?
రమ్ము నాతోఁ గూడ రమ్ము
యేసు నిన్ను రమ్మనెన్
మార్గాయాసమైన నేమి
మాకు మోక్షం చిక్కు వేళ
సువిశ్రాంతి కల్గును.
1. paradhaeshi, puNyakShaethra
yaathrAO boavuchuMdhuvaa?
yaesu naajnY thala poasi
moakSh moMdhAO boadhunu.
koMda lekki yaeLlu dhaaAOti
moakSh raajyM chaerudhaaAOka
muMdhu poavuchuMdhunu.
2. oMtigaanu boavudhuvae
neeku bhaya muMdadhaa?
laedhu naaku bhayamaela?
svaami nannu AO gaachunu;
moakSh raajyM chaerudhaaAOka
yaesu naakuAO dhoavachoopa
muMdhu poavuchuMdhunu.
3. paradhaeshi, moakShmMdhu
neeku laabha muMdunaa?
nithyaanMdha suvishraaMthi
yMdhu nuMdu laabhamu.
jeevanadhi neeLlu thraagi
yaesuthoa sadhaa vasiMpa
muMdhu poavuchuMdhunu
4. paradhaeshi, neethoa naenu
yaathra chaeya vachchunaa?
rammu naathoaAO gooda rammu
yaesu ninnu rammanen
maargaayaasamaina naemi
maaku moakShM chikku vaeLa
suvishraaMthi kalgunu.