anni saadhyame yesulo nannu balaparachu yesu nande nenu అన్ని సాధ్యమే యేసులో నన్ను బలపరచు యేసునందే నేను
నన్ను బలపరచు యేసునందే నేను
సర్వము చేయగలను
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
సమస్తం చేయగలను
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే
బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే
నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
నీటిపై నడిచెనే – నీటినే అణచెనే
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము||
హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే
బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే
షద్రకు మేషాకు అబేద్నెగోలను
అగ్నిలో ఉండియే కాపాడెనే
నరకపు మంటనుండి నను రక్షించిన
అగ్ని నేత్రాల నా యేసయ్యా… ||సాధ్యము||