ooruko naa praanamaa kalatha chendaku ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)
ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2)
నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2)
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2) ||ఊరుకో||
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట అసంభవమేగా (2)
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట అసంభవమేగా (2) ||ఊరుకో||
అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా
అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2)
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2) ||ఊరుకో||